కంప్రెసర్‌ల తయారీ ఏర్పాటుకు వోల్టాస్ రూ. 500 కోట్ల పెట్టుబడులు!

by  |
voltas
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దేశీయ ఎయిర్ కండీషనర్ తయారీ సంస్థ వోల్టాస్ త్వరలో అంతర్జాతీయ కంపెనీ భాగస్వామితో కలిసి కంప్రెసర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. దీనికోసం సుమారు రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొంది.

టాటా గ్రూప్ సంస్థ అంతర్జాతీయ భాగస్వామితో జాయింట్ వెంచర్‌గా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోందని వోల్టాస్ ఎండీ, సీఈఓ ప్రదీప్ బక్షి అన్నారు. అయితే అంతర్జాతీయ కంపెనీ గురించి ప్రదీప్ బక్షి వివరాలను వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద కంప్రెసర్ తయారీ సంస్థలలో ఒకటని మాత్రం పేర్కొన్నారు. కంప్రెసర్ తయారీ కోసం కనీసం రూ. 350 కోట్లను, ఎయిర్ కండీషనింగ్ కోసం మరో రూ. 150-200 కోట్ల పెట్టుబడులు పెడతామని ఆయన తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి రాగానే సుమారు రూ. 450-500 కోట్ల అదనపు పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని ప్రదీప్ బక్షి స్పష్టం చేశారు. అవసరమైన అనుమతులు లభించిన తర్వాతే ఏ ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు అనేది నిర్ణయిస్తామన్నారు.



Next Story

Most Viewed