భారత్‌తో రెట్రో పన్ను వివాద పరిష్కారానికి దరఖాస్తు చేసిన ఆ టెలికామ్ సంస్థ..

by  |
భారత్‌తో రెట్రో పన్ను వివాద పరిష్కారానికి దరఖాస్తు చేసిన ఆ టెలికామ్ సంస్థ..
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌తో భారత ప్రభుత్వంతో రెట్రో పన్ను వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో వొడాఫోన్ గ్రూపుతో భారత ప్రభుత్వానికి ఉన్న దీర్ఘకాలిక వివాదానికి ముగింపు పలికినట్టు అవుతుంది. ‘రెట్రో పన్ను వివాదం పరిష్కరించుకునేందుకు దరఖాస్తు చేశాము. భారత వ్యాపారానికి సంబంధించి పన్ను సమస్య తలెత్తలేదనే నమ్మకం తమకుంది. ఇది భారత సుప్రీంకోర్టు, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టుల ద్వారా నిర్ధారించబడిందని’ వొడాఫోన్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది.

కంపెనీ నిర్ణయంతో పన్ను రూపంలో వసూలు చేసిన రూ.44.7 కోట్లను వొడాఫోన్‌కు ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. కాగా 2007లో హచిసన్‌ సంస్థకు భారత్‌లో ఉన్న టెలికాం వ్యాపార విభాగంలో వొడాఫోన్‌ 67 శాతం వాటా కొనుగోలు చేసింది. దీనికోసం 11.2 బిలియన్‌ డాలర్లు చెల్లించింది. అయితే, ఆ ఒప్పందం సమయంలో హచిసన్‌కు జరిపిన చెల్లింపుల్లో నిర్దిష్ట పన్నులను మినహాయించుకోకపోవడం గురించి వొడాఫోన్‌కు ఆదాయ పన్ను శాఖ 2007లో నోటీసులు ఇచ్చింది.

ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును, అలాగే, ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించగా వొడాఫోన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఇటీవల కార్పొరేట్‌ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్‌ ట్యాక్స్‌ వివాదాలకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed