- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జియో, ఎయిర్‌టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా ఉచిత రీఛార్జ్ ఆఫర్!
<p>దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజాలు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్లను వెల్లడించగా, మంగళవారం వొడాఫోన్ ఐడియా ఉచితంగా రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. జియో, ఎయిర్‌టెల్ తరహాలోనే వొడాఫోన్ ఐడియా కూడా తక్కువ ఆదాయం కలిగిన 6 కోట్ల మంది వినియోగదారులకు రూ. 49 విలువైన రీఛార్జ్‌ను ఉచితంగా ఇస్తున్నట్టు వెల్లడించింది. దీనికోసం కంపెనీ రూ. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజాలు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్లను వెల్లడించగా, మంగళవారం వొడాఫోన్ ఐడియా ఉచితంగా రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. జియో, ఎయిర్‌టెల్ తరహాలోనే వొడాఫోన్ ఐడియా కూడా తక్కువ ఆదాయం కలిగిన 6 కోట్ల మంది వినియోగదారులకు రూ. 49 విలువైన రీఛార్జ్‌ను ఉచితంగా ఇస్తున్నట్టు వెల్లడించింది.
దీనికోసం కంపెనీ రూ. 294 కోట్లను ఖర్చు చేస్తుందని, రూ. 49 ఉచిత రీఛార్జ్‌తో రూ. 38 టాక్‌టైమ్, 100 డేటా లభిస్తుందని, ఇది 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుందని వొడాఫోన్ ఐడియా వివరించింది. దీంతో పాటు రూ. 79 రీచార్జ్ ప్లాన్ ద్వారా రూ. 128 టాక్‌టైమ్, 200 ఎంబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుందని కంపెనీ తెలిపింది.






