పుతిన్‌కు అరుదైన వ్యాధి… రష్యా అధ్యక్ష పదవికి త్వరలో గుడ్‌బై!

by  |
పుతిన్‌కు అరుదైన వ్యాధి… రష్యా అధ్యక్ష పదవికి త్వరలో గుడ్‌బై!
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అరుదైన వ్యాధి సోకిందా? మరో రెండు నెలల్లో ఆయన తన పదవికిరాజీనామా చేయనున్నారా? కొత్త చట్టం తీసుకోవడానికి కారణం అదేనా? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

వ్లాదిమిర్ పుతిన్ కు పార్కిన్సన్స్ వ్యాధి సోకిందని, ఈ వ్యాధి కారణంగానే ఆయన మరో రెండు నెలల్లో అధ్యక్ష పదవి నుండి వైదొలగనున్నారనే ప్రచారం జోరందుకుంది. పుతిన్ మాజీ జిమ్నాస్ట్, గర్ల్ ఫ్రెండ్ అలినా కబేవా.. ఆమె ఇద్దరు కూతుర్లు ఆయనను అధికార బాధ్యతల నుంచి తప్పుకోవాలని రిక్వెస్ట్ చేయడం, ఆమె అభ్యర్థనకు ఆయన ఒప్పుకున్నట్టు ఓ వీడియోలో రికార్డ్ అయిందని రష్యా పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల విడుదలైన ఓ వీడియోలో పుతిన్ తరచూ తన కాళ్ళు వణకడం కనిపించింది. ఆయన చేతులు కూడా స్వాధీనంలో లేవని, గ్రిప్ కోసం ఆయన ఒక పెన్ ను చేతిలో పెట్టుకున్నారని రష్యా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. విపరీతమైన నొప్పి కారణంగానే ఆయన కాలు కదుపుతున్నారని నిపుణులు పేర్కొన్నట్టు ‘ది సన్’ మీడియా సైతం వెల్లడించింది.

ఈ విషయంపై మాస్కో పొలిటికల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ వాలెరీ సోలోవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పుతిన్ కు పార్కిన్సన్ వ్యాధి సోకిందని, తనపై గర్ల్ ఫ్రెండ్ ప్రభావం ఎక్కువ ఉందని, ఆమె చెబితే కచ్చితంగా పుతిన్ అధ్యక్ష పదవి నుండి వైదొలుగుతారని సోలోవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే, పుతిన్ శాశ్వతంగా తానే అధ్యక్షుడిగా ఉండేలా రాజ్యాంగ సవరణ కోసం తీసుకొచ్చిన ప్రతిపాదన ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని పొలిటికల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ప్రతిపాదన చేసిన కొంతకాలానికే ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి సోకిందని వార్తలు రావడం గమనార్హం. ఈ పుకార్లపై క్లారిటీ రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే..!

Next Story

Most Viewed