ఘనంగా వైవా హర్ష వివాహం… హాజరైన సినీప్రముఖులు

by  |
Ahaha-1
X

దిశ, సినిమా: వైవా హర్ష కళ్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. చిన్ననాటి స్నేహితురాలు అక్షరతో ఏడడుగులు వేసిన హర్ష.. బంధుమిత్రుల సమక్షంలో తన మెడలో మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్‌లోని జరిగిన ఈ ప్రైవేట్ సెరమనీకి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత ఎస్‌కెఎన్, కమెడియన్ ప్రవీణ్‌.. పెళ్లికొడుకు హర్షతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన దర్శకుడు మారుతి.. హర్షకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు పెళ్లి దుస్తుల్లో హర్ష అదిరిపోయాడని కామెంట్ చేస్తున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇక యూట్యూబర్‌గా కెరియర్ ప్రారంభించిన హర్ష.. వైవా కాన్సెప్ట్‌తో వచ్చిన వీడియోలతో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆహాలో స్పెషల్ షోస్‌తో ఆకట్టుకుంటున్న ఆయన.. వరుస సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed