- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢీ సీక్వెల్ డబుల్ డోస్.. డి & డి
<p>దిశ, వెబ్‌డెస్క్: బర్త్‌డే బాయ్ విష్ణు మంచు న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 2007లో రిలీజై థియేటర్‌లో నవ్వుల పువ్వులు పూయించిన ‘ఢీ’ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం విష్ణు కెరియర్‌లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాగా.. ప్రస్తుతం దీనికి సీక్వెల్ అప్‌డేట్ ఇచ్చారు. ‘డి అండ్ డి’ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా డబుల్ డోస్ ఇస్తుందని గ్యారంటీ ఇచ్చాడు. అవ్రమ్ భక్త మంచు సమర్పణలో వస్తున్న సినిమాను 24 […]</p>

దిశ, వెబ్‌డెస్క్: బర్త్‌డే బాయ్ విష్ణు మంచు న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 2007లో రిలీజై థియేటర్‌లో నవ్వుల పువ్వులు పూయించిన ‘ఢీ’ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం విష్ణు కెరియర్‌లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాగా.. ప్రస్తుతం దీనికి సీక్వెల్ అప్‌డేట్ ఇచ్చారు. ‘డి అండ్ డి’ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా డబుల్ డోస్ ఇస్తుందని గ్యారంటీ ఇచ్చాడు. అవ్రమ్ భక్త మంచు సమర్పణలో వస్తున్న సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా.. ఈ మూవీ కోసం శ్రీను వైట్లతో మరోసారి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు విష్ణు. ఈ వార్తతో మంచు అభిమానులు ఖుష్ అవుతుండగా.. టైటిల్ పోస్టర్ కూడా భలే ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. రెండు బేడీలతో ఉన్న పోస్టర్ ఆసక్తికరంగా ఉండగా.. ఈ చిత్రం ద్వారా అటు శ్రీను వైట్ల, ఇటు మంచు విష్ణు కమ్‌బ్యాక్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు.
Here we go again! But this time it’s D&D Double Dose. Very excited to partner with my big brother Sreenu Vaitla garu again. God speed! #DD #Doubledose pic.twitter.com/TLeCZAq4kd
— Vishnu Manchu (@iVishnuManchu) November 23, 2020
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌తో ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండాలంటున్న శ్రీను వైట్ల అభిమానులు.. ఈ చిత్రంలో బ్రహ్మానందంకు ఓ మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుందని కోరుతున్నారు. శ్రీహరి గారు లేని లోటు తీర్చలేనిదని.. సేమ్ కాస్ట్ రిపీట్ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తున్నారు.






