- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ నిర్మాతపై పోలీస్ కేసు పెట్టిన హీరో
<p>దిశ, సినిమా : కోలీవుడ్ హీరో విశాల్‌కు వివాదాలు, విభేదాలు కొత్తేం కాదు. డిటెక్టివ్ మూవీ డైరెక్టర్ మిస్కిన్‌తో కొంతకాలంగా కొనసాగుతున్న గొడవలు ఈ మధ్యే సమసిపోగా, ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అప్పు కోసం ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి వద్ద ష్యూరిటీగా పెట్టిన డాక్యుమెంట్లను ప్రస్తుతం అప్పు చెల్లించినా తిరిగివ్వడం లేదని ఆరోపించాడు. అంతేకాదు డాక్యుమెంట్లను పోగొట్టడం సరైన చర్య కాదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్టు ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. ‘ఇరుంబు […]</p>

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో విశాల్‌కు వివాదాలు, విభేదాలు కొత్తేం కాదు. డిటెక్టివ్ మూవీ డైరెక్టర్ మిస్కిన్‌తో కొంతకాలంగా కొనసాగుతున్న గొడవలు ఈ మధ్యే సమసిపోగా, ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అప్పు కోసం ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి వద్ద ష్యూరిటీగా పెట్టిన డాక్యుమెంట్లను ప్రస్తుతం అప్పు చెల్లించినా తిరిగివ్వడం లేదని ఆరోపించాడు. అంతేకాదు డాక్యుమెంట్లను పోగొట్టడం సరైన చర్య కాదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్టు ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. ‘ఇరుంబు తిరై’ సినిమా కోసం ఆర్‌బీ చౌదరి వద్ద తీసుకున్న రుణం తిరిగి చెల్లించి నెలలు గడుస్తున్నా చెక్ లీవ్స్, బాండ్స్, ప్రామిసరీ నోట్స్ తిరిగివ్వకపోవడం అంగీకారయోగ్యం కాదు’ అని తెలిపారు.
ఈ విషయంలో కొన్నిరోజులుగా సాకులు చెప్తూ వచ్చిన చౌదరి.. చివరకు డాక్యుమెంట్స్ పోయాయని చెప్పడంతో పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ ఇష్యూకు ముందు చక్ర మూవీ ఓటీటీలో రిలీజ్ విషయంలోనూ సమస్యలు ఎదుర్కోగా.. కోర్టు ప్రమేయంతో రిలీజైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విశాల్ ‘తుప్పరివాలన్2’తో పాటు ‘ఎనిమీ’ చిత్రాల్లో నటిస్తున్నాడు. కాగా ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఎనిమీ’ మూవీలో ఆర్య కూడా కీ రోల్ పోషిస్తున్నాడు.






