నాట్ ఏ కామన్ మ్యాన్.. ఆసక్తిరేపుతోన్న #Vishal31 ప్రీ లుక్

by  |
నాట్ ఏ కామన్ మ్యాన్.. ఆసక్తిరేపుతోన్న #Vishal31 ప్రీ లుక్
X

దిశ, సినిమా : ‘చక్ర’ సినిమాతో సక్సెస్ అందుకున్న విశాల్ తన 31వ చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ ట్యాగ్ లైన్‌తో విశాల్ ప్రీలుక్ ఆసక్తి రేపుతుండగా… ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నడుస్తున్న జనసందోహం నుంచి హీరో ఫేస్‌ను చూపించిన మేకర్స్.. కోపంతో రగిలిపోతున్న తన కళ్లను హైలెట్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సినిమా రూపొందుతుండగా.. తు.ప.శరవణన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు బాలసుబ్రమణ్యం తీసుకోగా.. ఎస్ఎస్ మూర్తి సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎన్‌బి శ్రీకాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే మిగిలిన కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ కూడా ప్రకటిస్తామన్నారు మేకర్స్.



Next Story

Most Viewed