విశాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ

by  |
vishal
X

దిశ, సినిమా : తమిళ స్టార్ హీరో విశాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. స్టార్ ప్రొడ్యూసర్ ఎస్ వినోద్ కుమార్, విశాల్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతోంది. పాన్‌ ఇండియా లెవెల్‌లో నిర్మించనున్న ఈ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌కు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నాడు. విశాల్ కెరీర్‌లో 33వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే విశాల్, ఆర్య మల్టీస్టారర్‌గా వచ్చిన ‘ఎనిమి’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా మినీ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ వినోద్ కుమార్ నిర్మించగా.. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడం పట్ల విశాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story

Most Viewed