విశాఖ వైసీపీ నేతలకు పండగే.. వారందరికీ కీలక పదవులు

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-13 03:11:47  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవులపై కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు పార్టీ కోసం శ్రమించిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఈసారి నామినేటెడ్ పదవుల్లో విశాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో విశాఖకు తొలి ప్రాధాన్యతగా 11మందికి చైర్మన్ పదవుల కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొంతమందికి డైరెక్టర్ పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే విశాఖకు చెందిన [&hellip;]</p>

vishaka news
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవులపై కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు పార్టీ కోసం శ్రమించిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఈసారి నామినేటెడ్ పదవుల్లో విశాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల్లో విశాఖకు తొలి ప్రాధాన్యతగా 11మందికి చైర్మన్ పదవుల కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొంతమందికి డైరెక్టర్ పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే విశాఖకు చెందిన 11 మంది వైసీపీ నేతలను పలు కార్పొరేషన్‌లకు చైర్మన్‌లగా నియామకం పూర్తైందని, మధ్యాహ్నాం జీవోలు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చైర్మన్‌లుగా నియమితులైన అభ్యర్థుల వివరాలు ఇవే..

1. వీఆర్ఎండీఏ చైర్మన్-అక్కరమాని విజయనిర్మల ( విశాఖ తూర్పు నియోజకవర్గం)

2. రాష్ట్ర విద్యావిభాగం వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ -మళ్ల విజయప్రసాద్ ( విశాఖ పశ్చిమ )

3. నెడ్ క్యాప్ చైర్మన్-కేకే రాజు ( విశాఖ ఉత్తరం )

4. రాష్ట్రమైనారిటీ విభాగం చైర్మన్- జాన్ వెస్లీ ( విశాఖ దక్షిణం )

5. రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ -దాడి రత్నాకర్ ( అనకాపల్లి )

6. విశాఖ రీజియన్ పెట్రోకారిడార్ చైర్మన్- తైనాల విజయకుమార్‌ ( విశాఖ ఉత్తరం )

7. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్-ప్రముఖ ఆడిటర్ జీవి

8. విశాఖ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్-చింతకాయల సన్యాసిపాత్రుడు ( నర్సీపట్నం )

9. డీసీఎమ్ చైర్‌పర్సన్‌-పల్లా చినతల్లి ( గాజువాక )

10. రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్-సుధాకర్‌

11. డీసీసీబీ ఛైర్మన్-సుకుమార్ వర్మ కొనసాగింపు( యలమంచిలి )

Next Story