ఇది ప్రారంభమే.. ముగింపు కాదు.. విరాట్ కోహ్లీ హాట్ కామెంట్స్

305

దిశ, వెబ్‌డెస్క్: టీ-20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ ప్రత్యర్థి జట్టుకు పరోక్షంగా సవాల్ విసిరాడు. టీ 20 సిరీస్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌ కేవలం ఆరంభం మాత్రమే.. ఇదే ముగింపు కాదని.. ముందు మ్యాచులపై ఫోకస్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు.

‘మేము అనుకున్న ప్రకారం మ్యాచ్ అనుకూలించలేదు.. ఓటమిని అంగీకరిస్తున్నాము. పరిస్థితులు జట్టును ఒత్తిడిలోకి నెట్టాయి. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో జట్టును తిరిగి ఫామ్‌లోకి తీసుకురావడం కష్టంగా మారింది. పాక్ ఆటగాళ్లు బ్యాటింగ్‌లో చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. భారత బౌలింగ్‌ వారిని అడ్డుకోలేకపోయింది. కానీ, మేము ఒత్తిడిని జయిస్తాము.. ఇది టోర్నమెంట్ ప్రారంభమే.. ముగింపు కాదు’ -విరాట్‌ కోహ్లీ

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..