అనుష్క అందానికి మిలియన్స్ లైక్స్

by  |
అనుష్క అందానికి మిలియన్స్ లైక్స్
X

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బెటర్ హాఫ్, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్క శర్మ.. వోగ్ కవర్ పేజీపై హొయలు పోతోంది. ఆ బ్యూటీ ఫోటోలు.. కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్‌లో అనుష్క అదిరిపోయిందంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, విరాట్ కోహ్లీ కూడా ఆమె స్టిల్స్‌కు ఫిదా అయిపోయాడు.

కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న అనుష్క.. నిర్మాతగానూ ఆచితూచి అడుగులేస్తూ విజయాలను సొంతం చేసుకుంటోంది. ఇటీవలే విడుదలైన ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ మంచి టాక్ సొంతం చేసుకోగా.. తాజాగా విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ ఫిల్మ్ ‘బుల్ బుల్’ కూడా నిర్మాతగా అనుష్కకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఫ్యామిలీని, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను అనుష్క ఎంతో చక్కగా డీల్ చేస్తోంది. తాజాగా వోగ్ మ్యాగజిన్ కవర్ పేజ్ కోసం ఫొటో షూట్‌‌కు హాజరైన అనుష్క.. ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాలో అప్‌డేట్ చేసింది. వాటికి విశేషమైన స్పందన లభించింది. దాదాపు 2 మిలియన్ల మంది లైక్ చేశారు. ఆ జాబితాలో బాలీవుడ్ నటి అలియాభట్‌తో పాటు ఆమె భర్త భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. ‘నిజమైన అందానికి నిదర్శనం నీవు’ అంటూ అలియా కామెంట్ పెట్టగా, విరాట్.. ఎమోషనల్ ఎమోజీలతో పాటు హార్ట్ ఐ ఎమోజీలను పోస్ట్ చేశాడు.

Next Story

Most Viewed