ఇషాంత్‌ను ఫ్లైట్‌లోనే ఆటపట్టించిన కోహ్లీ

by  |
ఇషాంత్‌ను ఫ్లైట్‌లోనే ఆటపట్టించిన కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు దక్షిణాఫ్రికా చేరుకున్నది. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన భారత జట్టు సుదీర్ఘ ప్రయాణం అనంతరం జోహన్నెస్‌బర్గ్‌లో దిగింది. ఆటగాళ్ల ప్రయాణం ఎలా సాగిందో బీసీసీఐ ఒక వీడియో విడుదల చేసింది. ముంబై నుంచి బయలుదేరిన తర్వాత విమానం ఇంధనం కోసం తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌లో ఆగింది. అక్కడ మయాంక్ అగర్వాల్ స్కూబా డైవింగ్ నేర్చుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత విమానం నేరుగా దక్షిణాఫ్రికా వైపు వెళ్లింది. విమానంలో పేసర్ ఇషాంత్ శర్మను కెప్టెన్ కోహ్లీ ఆటపట్టించాడు.

ఇషాంత్ బ్యాగ్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చని చలోక్తులు విసిరాడు. నీ గోడౌన్(బ్యాగ్)లో ఏమున్నాయో ఒకసారి చూపించు అని కోహ్లీ అడగ్గా.. శర్మ సరదాగా దాంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పాడు. ఇషాంత్ శర్మ బ్యాగ్ ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్లిపోవచ్చని అనగా.. నన్ను అలా ఆటపట్టించొద్దని ఇషాంత్ జవాబిచ్చాడు. ఇక అశ్విన్ అయితే మహ్మద్ షమీ మీద సెటైర్లు వేశాడు. ఫ్లయిట్ ఎక్కిన దగ్గర నుంచి అతడు కనపడటం లేదని.. జర్కిన్‌లో దూరిపోయాడని చెప్పాడు. యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ చాలా సీరియస్‌గా ద్రవిడ్‌తో చర్చిస్తూ కనపడ్డాడు. చతేశ్వర్ పుజార అయితే తనకు నిద్రపట్టడం లేదని.. అందుకోసం ట్రై చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed