బయటపడ్డ లైంగిక వేధింపుల డ్రామా.. అయినా తగ్గని అహంకారం: నటి షిండే సంచలన పోస్ట్!

by Gantepaka Srikanth |

'భాబీజ్ ఘర్ పర్ హై' టీవీ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి శిల్పా షిండే మరోసారి వార్తల్లో నిలిచారు.

బయటపడ్డ లైంగిక వేధింపుల డ్రామా.. అయినా తగ్గని అహంకారం: నటి షిండే సంచలన పోస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: 'భాబీజ్ ఘర్ పర్ హై' టీవీ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి శిల్పా షిండే మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసు తప్పుడుదేననీ ఆమె ఇటీవల అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) వంటి ఫిల్మ్ బాడీలు డిమాండ్ చేయడం, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాయడంతో బాలీవుడ్ వ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాలపై స్పందించిన శిల్పా షిండే.. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అత్యంత ఘాటుగా, సవాలు విసిరేలా ఒక పోస్ట్ (Cryptic Post) పెట్టారు.

అసలు వివాదం ఏంటంటే..?

తనపై ఫిల్మ్ అసోసియేషన్లు చర్యలకు సిద్ధమవుతున్న వేళ, శిల్పా షిండే హిందీలో "జో ఉఖాడ్నా హై ఉఖాడ్‌లో" (మీరు ఏం పీకుతారో పీకండి.. ఏం చేసుకుంటారో చేసుకోండి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దల ఒత్తిళ్లకు లేదా హెచ్చరికలకు తాను లొంగే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పేలా ఆమె ఈ పోస్ట్ పిట్టారు. అసలు వివాదం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం 'భాబీజీ ఘర్ పర్ హై' షో నుంచి బయటకు వచ్చిన సమయంలో... ఆ సీరియల్ నిర్మాత సంజయ్ కోహ్లీ తనను లైంగికంగా వేధించారంటూ శిల్పా షిండే తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చట్టపరమైన, సామాజికపరమైన చర్చ జరిగింది. అయితే, ఇటీవల ఆమె ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని, తప్పుడు కేసు పెట్టానని అంగీకరించడంతో సినీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. "తప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వల్ల నిజంగా బాధితులైన మహిళల పోరాటాలు దెబ్బతింటాయి. ఇండస్ట్రీలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి." అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) సీరియస్ అయింది. పరిశ్రమకు చెందిన అసోసియేషన్లు ఒకవైపు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుంటే, శిల్పా షిండే మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 'జో ఉఖాడ్నాహై ఉఖాడ్ లో' అంటూ రిటార్ట్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరింత దుమారం రేపుతోంది.

Next Story