- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో వర్షం.. రానున్న రెండుగంటల్లో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది.

దిశ, వెబ్‌డెస్క్: మండుటెండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న భాగ్యనగరవాసుల్ని వర్షం పలుకరించింది. మధ్యాహ్నం వరకూ మాడు పగిలే ఎండ కాయగా.. ఆ తర్వాతి నుంచి నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, యూసుఫ్ గూడ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతుండగా.. హైదర్ గూడ, ఉప్పరపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
రానున్న రెండు గంటల్లో..
రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు.. మెదక్, సిద్ధిపేట, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి - భువనగిరి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.






