- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ నుంచి ఆస్ట్రేలియాకు టీమిండియా
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్లు సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం గురువారం దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో సిడ్నీ వెళ్లనున్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా జట్టు బయోబబుల్‌లో ఉన్నది. ఫైనల్స్ ముగిసిన వెంటనే ముంబయి, ఢిల్లీ జట్లలోని టీమ్ ఇండియా సభ్యులో ఈ బబుల్‌లో చేరారు. వీరందరూ ఆస్ట్రేలియా వెళ్లిన అనంతరం సిడ్నీలో క్వారంటైన్‌లో ఉంటారు. సిడ్నీ క్రికెట్ స్టేడియంలోనే వన్డే జట్టు సాధన మొదలు పెడుతుందని బీసీసీఐ వెల్లడించింది. క్రికెటర్లతో పాటు సహాయక […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్లు సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం గురువారం దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో సిడ్నీ వెళ్లనున్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా జట్టు బయోబబుల్‌లో ఉన్నది. ఫైనల్స్ ముగిసిన వెంటనే ముంబయి, ఢిల్లీ జట్లలోని టీమ్ ఇండియా సభ్యులో ఈ బబుల్‌లో చేరారు. వీరందరూ ఆస్ట్రేలియా వెళ్లిన అనంతరం సిడ్నీలో క్వారంటైన్‌లో ఉంటారు.
సిడ్నీ క్రికెట్ స్టేడియంలోనే వన్డే జట్టు సాధన మొదలు పెడుతుందని బీసీసీఐ వెల్లడించింది. క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది, కోచింగ్ స్టాఫ్ కూడా వెళ్లనున్నారు. ‘ముంబయి జట్టు క్రికెటర్లు ఫైనల్స్‌లో విజయం సాధించిన అనంతరం హోటల్‌లో జరిగే వేడుకల్లో కూడా పాల్గొనలేదు. ముంబయికి చెందిన టీమ్ ఇండియా క్రికెటర్లు వెంటనే బయోబబుల్‌లో ప్రవేశించారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. నవంబర్ 27 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
Next Story






