- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీ బయోపిక్ లో అనుష్క ఉండాల్సిందేనట!
<p>అనుష్క శర్మ.. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని పూర్తిగా మార్చేసిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పాడు. అనుష్క తన లైఫ్ లోకి రావడం నిజంగా అదృష్టం అంటున్నాడు. నేను ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండేవాడినని… అనుష్క వల్లే ఇతరులకు హెల్ప్ చేయాలి, ఇతరులను అర్థం చేసుకుని మసులుకోవాలనే ఆలోచన మొదలైందని అన్నాడు. స్వార్థంగా ఆలోచించకుండా.. సహాయం చేయాలనే మనస్తత్వం తన భార్య అనుష్క శర్మది అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. భారత క్రికెటర్ గా ఎన్నో […]</p>

అనుష్క శర్మ.. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని పూర్తిగా మార్చేసిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పాడు. అనుష్క తన లైఫ్ లోకి రావడం నిజంగా అదృష్టం అంటున్నాడు. నేను ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండేవాడినని… అనుష్క వల్లే ఇతరులకు హెల్ప్ చేయాలి, ఇతరులను అర్థం చేసుకుని మసులుకోవాలనే ఆలోచన మొదలైందని అన్నాడు. స్వార్థంగా ఆలోచించకుండా.. సహాయం చేయాలనే మనస్తత్వం తన భార్య అనుష్క శర్మది అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.
భారత క్రికెటర్ గా ఎన్నో రికార్డులు సృష్టించిన కోహ్లీ.. కెప్టెన్ గా భారత్ కు మరిచిపోలేని విజయాలను అందించాడు. అలాంటి కోహ్లీ జీవితాన్ని బయోపిక్ గా తీస్తే తప్పకుండా నటిస్తానంటున్న ఈ రికార్డుల రారాజు అందుకు ఓ షరతు పెట్టాడు. ఆ సనిమాలో తన భార్యగా అనుష్క తప్పకుండా నటించాలంటున్నాడు. అనుష్కతో కలిసి తాను ఖచ్చితంగా బయోపిక్ లో ఉండాలని కోరుకున్నాడు.
ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రితో వీడియో కాల్ సెషన్ సందర్భంగా అనుష్కతో ఉన్న అనుబంధం, కోహ్లీ బయోపిక్ గురించి చర్చించాడు. నా జీవితం మెరుగుపడింది అంటే కారణం అనుష్కనే అంటూ ప్రశంసలు కురిపించాడు..






