విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు

91

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో అరుదైన రికార్డు సాధించాడు. సోమవారం రోజు కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 100 మిలియన్ (10 కోట్లు) ఫాలోవర్ల మార్కును చేరుకుంది. ఆసియాకు చెందిన సెలబ్రిటీ 100 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకోవడం ఇదే తొలిసారి. మరే ఇతర ఆసియన్ సెలబ్రిటీ కూడా కోహ్లీ దరిదాపుల్లో లేరు. కోహ్లీ తర్వాత ప్రియాంక చోప్రా 60.8 మిలియన్లు, శ్రద్దా కపూర్ 58 మిలియన్ల ఫాలోవర్లతో తర్వాత స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో 266 మిలియన్, గాయని అరియానా గ్రాండే 224 మిలియన్లు, డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ డ్వేన్ జాన్‌సన్ (ది రాక్) 220 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతున్నారు.

కోహ్లీ ఆరవ ర్యాంకులో ఉన్నాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో క్రిస్టియానో రొనాల్డో తర్వాత లియోనీ మెస్సీ 187 మిలియన్, నెమార్ 147 మిలియన్లతో తొలి మూడు స్థానాల్లో ఉండగా.. నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ 100 మిలియన్ ఫాలోవర్ల ఘనతను ఐసీసీ కూడా గుర్తించింది. ఈ మార్కు సాధించిన తొలి క్రికెటర్ కోహ్లీ అంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నది. కాగా, కోహ్లీ ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్‌గా చాలా సంస్థలకు పని చేస్తున్నాడు. అతడు చేసే సోషల్ మీడియా మెసేజ్‌లకు కూడా కోట్ల రూపాయల పారితోషికం లభిస్తున్నది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..