Viral video: ఇదేం వింతో.. పామును అలా కూడా తీయవచ్చా..

by  |
viral video
X

దిశ,వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వింతలూ, విడ్డురాలకు కొదవలేదు. ఎక్కడో జరిగిన వింతలను మనం నిమిషాలలో చూసేస్తున్నాం. ఈ క్రమంలో ఓ వ్యక్తి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటీ అనుకుంటున్నారా.. ఓ వ్యక్తి బతికి ఉన్న పామును తన చేతితో పట్టుకుని కూర్చున్నాడు. అనంతరం ఆ పామును మెల్లగా కళ్లు మూసుకొని ముక్కులోంచి లోపలికి పంపాడు. తర్వాత ఆ పామును నోటి నుంచి బయటకు తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ వీడియోను బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఇది వైరల్‌గా మారింది. ఇప్పటికి ఈ వీడియోను 20 లక్షలమంది చూశారు.


Next Story

Most Viewed