- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే అంబులెన్స్ అంటా!
by Shyam |
<p>దిశ ప్రతినిధి, మెదక్: సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో 108 అంబులెన్స్ కోసం ఓ వ్యక్తి హెల్ప్ లైన్ సెంటర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ వాహనం పంపించాలని కోరారు. కానీ కాల్ సెంటర్ సిబ్బంది 108 వాహనం పంపించాలంటే కరోనా పాజిటీవ్ సర్టిఫికెట్ ఉంటేనే పంపిస్తామని తేల్చిచెప్పారు. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని సదరు వ్యక్తి వేడుకున్న.. కోవిడ్ సర్టిఫికెట్ ఉంటే తప్ప అంబులెన్స్ పంపడం కుదరదని చెప్పటంతో కంగుతిన్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో 108 అంబులెన్స్ కోసం ఓ వ్యక్తి హెల్ప్ లైన్ సెంటర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ వాహనం పంపించాలని కోరారు. కానీ కాల్ సెంటర్ సిబ్బంది 108 వాహనం పంపించాలంటే కరోనా పాజిటీవ్ సర్టిఫికెట్ ఉంటేనే పంపిస్తామని తేల్చిచెప్పారు. తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని సదరు వ్యక్తి వేడుకున్న.. కోవిడ్ సర్టిఫికెట్ ఉంటే తప్ప అంబులెన్స్ పంపడం కుదరదని చెప్పటంతో కంగుతిన్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటుచేసుకుంది. అంతేకాకుండ సొంత వాహనం వాడుకోవాలని 108 సిబ్బంది ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






