హోల్డ్ ఆన్ బేబీ : జీహెచ్ఎంసీ మేయర్ ఎవరో చెక్ చేస్తున్నాను

by  |
హోల్డ్ ఆన్ బేబీ : జీహెచ్ఎంసీ మేయర్ ఎవరో చెక్ చేస్తున్నాను
X

దిశ,వెబ్‌డెస్క్: అప్పుడే పెళ్లైన నవదంపతుల బెడ్ రూమ్ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వెలుగులోకి రాకపోయినా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఇమెజెస్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.., మీమర్స్ పండగ చేసుకుంటున్నారు.

అప్పుడే పెళ్లైన వధువు బెడ్ రూమ్‌లోని బెడ్ పై కూర్చొని వరుడి కోసం ఎదురు చూస్తుండగా.., వరుడు మాత్రం బెడ్‌రూమ్ లో ఉన్న సిస్టమ్ ముందు కూర్చన్న ఇమెజెస్ దర్శనమిస్తున్నాయి. కొన్ని నిమిషాల ముందే పెళ్లైనట్లుగా వధూవరులు ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. ఎర్రటి లెహంగాలో బెడ్ పై పెళ్లికూతురంటే.. సిస్టమ్ ముందు కూర్చున్న వరుడు గోల్డెన్ కలర్ కుర్తా, ఫైజమాలో కనిపించాడు.

ప్రస్తుతం ఆ ఇమెజెస్ నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. హోల్డ్ ఆన్ బేబీ.. ట్విట్టర్ నోటిఫికేషన్ ఏం వచ్చిందో చెక్ చేస్తున్నానంటూ పెళ్లికొడుకు, పెళ్లికూతురితో అంటున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరో నెటిజన్ హోల్డ్ ఆన్ బేబీ జీహెచ్ఎంసీ మేయర్ ఎవరో చెక్ చేస్తున్నాడంటూ రిప్లయ్ ఇస్తున్నాడు. ఇక ఆ నవదంపతులు పేర్లు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. కానీ వాళ్ల గురించి ఎలా వివరాలు తెలియరాలేదు.



Next Story