98 శాతం మంది పనిలేని వాళ్లే : కమెడియన్

by  |
98 శాతం మంది పనిలేని వాళ్లే : కమెడియన్
X

దిశ, సినిమా : కొవిడ్ 19 లాంటి క్లిష్టపరిస్థితుల్లో బాధల్లో ఉన్న ఒకరికైనా హెల్ప్ చేయడం బెటర్ అంటున్నారు స్టాండప్ కమెడియన్, యాక్టర్ వీర్ దాస్. సోషల్ మీడియాలో మిలియన్ ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీలు అవగాహన, నిధుల సేకరణ కోసం.. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆయుధంగా మార్చుకోవాలని సూచించారు. సెకండ్ వేవ్‌లో తనకు సంబంధించిన చాలా మందిని కోల్పోయినా నవ్వడం, నవ్వించడం ఆపలేదన్న ఆయన.. ఇంటి నుంచే తన పనిని చేసుకునే అదృష్టం కలిగినందుకు ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

తనకు తెలిసిన పని ఒక్కటే నవ్వించడం. దాని ద్వారానే ఇతరులకు హెల్ప్ చేస్తానని చెప్పాడు. సొసైటీలో సెలబ్రిటీ హోదా పొందుతున్న వ్యక్తులు తమ బాధ్యత నిర్వర్తించకపోతే మరెవరు చేస్తారు? అని ప్రశ్నించాడు. జనాభాలో దాదాపు 98 శాతం మంది పనులకు వెళ్లడం లేదని, వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయన్న యాక్టర్.. పాండెమిక్ టైంలోనూ తమ పనిని కంటిన్యూ చేస్తూ సంపాదిస్తున్న రెండు శాతం మందిలో తాను ఉన్నానని, దీన్ని వృథా చేసుకోనని చెప్పాడు. ఇంట్లో డెస్క్ వద్ద కూర్చుని సంపాదించిన మొత్తాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు వినియోగిండచం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు.


Next Story