- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో గర్భిణి అంత్యక్రియలను అడ్డుకున్నారు
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు అమానుషంగా వ్యవహరించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నాగిరెడ్డిపల్లికి చెందిన లావణ్య అనే ఓ గర్భిణి నంద్యాల ఆస్పత్రిలో ప్రసవ వేదనతో మృతిచెందింది. దీంతో ఆమె బంధువులు నాగిరెడ్డిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు లావణ్య మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లారు. కడుపులో బిడ్డ ఉండగా అంత్యక్రియలు చేస్తే తమ ఊరికి అరిష్టమంటూ నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమిలేక ఆ బంధువులు లావణ్య మృతదేహాన్ని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు అమానుషంగా వ్యవహరించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నాగిరెడ్డిపల్లికి చెందిన లావణ్య అనే ఓ గర్భిణి నంద్యాల ఆస్పత్రిలో ప్రసవ వేదనతో మృతిచెందింది. దీంతో ఆమె బంధువులు నాగిరెడ్డిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు లావణ్య మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లారు. కడుపులో బిడ్డ ఉండగా అంత్యక్రియలు చేస్తే తమ ఊరికి అరిష్టమంటూ నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమిలేక ఆ బంధువులు లావణ్య మృతదేహాన్ని చెట్టుకు కట్టేశారు. ఇది గమనించిన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆ గ్రామంలోనే లావణ్య అంత్రయక్రియలు నిర్వహించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Next Story






