- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైన్ షాపు ఏర్పాటుకు గ్రామస్తులు అడ్డగింత
<p>దిశ, చిలుకూరు: గ్రామస్థులు ససేమిరా అనడంతో మద్యం దుకాణం ప్రారంభం నిలిచిపోయింది. మండలంలోని బేతవోలులో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి రెండు మద్యం దుకాణాలు మంజూరు కాగా.. మండల కేంద్రం చిలుకూరులో దుకాణం గురువారం ప్రారంభించారు. బేతవోలులో మాత్రం గ్రామంలో ఏర్పాటు చేయవద్దని ధర్నా నిర్వహించారు. గతంలో గ్రామం మధ్యలో దుకాణం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఒక వృద్ధుడు కూడా […]</p>

దిశ, చిలుకూరు: గ్రామస్థులు ససేమిరా అనడంతో మద్యం దుకాణం ప్రారంభం నిలిచిపోయింది. మండలంలోని బేతవోలులో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి రెండు మద్యం దుకాణాలు మంజూరు కాగా.. మండల కేంద్రం చిలుకూరులో దుకాణం గురువారం ప్రారంభించారు. బేతవోలులో మాత్రం గ్రామంలో ఏర్పాటు చేయవద్దని ధర్నా నిర్వహించారు. గతంలో గ్రామం మధ్యలో దుకాణం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఒక వృద్ధుడు కూడా మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోదాడ రూరల్ సీఐ శివరాం రెడ్డి, చిలుకూరు ఎస్సై నాగభూషణ్ రావు ఆధ్వర్యంలో ఎక్సైజ్, సివిల్ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, కేసులు పెడతామని హెచ్చరించినా మద్యం దుకాణం దూరంగా తరలించేంతవరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. చేసేదేమీలేక పోలీసులు వెనుతిరిగారు. గ్రామస్థులు ధర్నా కొనసాగించారు. బేతవోలు సర్పంచ్ ఒట్టి కూటి చంద్రకళ భర్త నాగయ్య కూడా ధర్నాలో పాల్గొనడం గమనార్హం.
- Tags
- case






