ఉప్పెన రీమేక్ తో విజయ్ తనయుడి ఎంట్రీ?

by  |
ఉప్పెన రీమేక్ తో విజయ్ తనయుడి ఎంట్రీ?
X

ఉప్పెన… సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బుచ్చి బాబు సన దర్శకత్వం వహించిన సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కృతిషెట్టీ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్ ప్లే చేస్తూ… తొలిసారి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం కథ నచ్చడంతో తమిళ రీమేక్ రైట్స్ కొనుగోలు చేశాడు.

కాగా ఎప్పటి నుంచో తన కొడుకు సంజయ్ ను మంచి లవ్ స్టొరీ ద్వారా పరిచయం చేయాలని అనుకుంటున్నారు కోలీవుడ్ హీరో విజయ్. ఈ కథను సేతుపతి విజయ్ కు వినిపించగా ఒకే చేశారట. ఈ చిత్రం ద్వారా సంజయ్ ను సినీ రంగానికి పరిచయం చేయనున్నాడట. కాగా తెలుగులో సేతుపతి చేసిన పాత్రను తానే తమిళ్ లో కూడా చేయనున్నాడట. కాగా తెలుగులో ఉప్పెన ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా పడింది.

Tags: Vijay Sethupathi, Vijay, Sanjay, Vaishnav Tej, Krithi Shetty, Tollywood, Kollywood


Next Story

Most Viewed