బెజవాడలో ‘నకిలీ ప్రేమ’ దందా గుట్టురట్టు

by  |
Sridivya Vijayawada
X

దిశ, వెబ్‌డెస్క్ : పై ఫొటోలో కనిపిస్తున్న మహిళ ఎంతో చక్కగా.. అందంగా ఉంది కదా.. చాలా గ్లామర్‌గా ఉంది, కొంటె చూపులు చూస్తోంది అని మీరు ఆమెను ఫాలో అయితే ఇక అంతే. తియ్యని మాటలతో మత్తుజల్లుతూ.. వలపు వల విసురుతోంది. పెళ్లి చేసుకుంటానని మైకం తెప్పిస్తోంది. అలా తన గుప్పిట్లోకి వచ్చాక.. నిలువు దోపిడీ చేస్తోంది. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు. పదుల సంఖ్యలో మోసపోయారు మగ మహరాజులు. వారి వద్ద నుంచి లక్షలు కాజేసి బెదిరింపులకు పాల్పడుతోంది. తాజాగా ఓ వ్యక్తి నుంచి రూ.80 లక్షలను కొల్లగొట్టిందీ కిలాడీ లేడి. పోలీసుల కథనం ప్రకారం..

శ్రీదివ్య అనే మహిళది విజయవాడ. ఆమెకు ఇప్పటికే వివాహమై పిల్లుల ఉన్నారు. కానీ నగరంలో డబ్బున్న యువకులను ఎంచుకుని వారిపై వలపు వల విసురుతోంది. అలా చిక్కన వారికి ప్రేమ, పెళ్లి అంటూ తన మత్తులోకి దింపుతోంది. వాళ్లు పూర్తిగా శ్రీదివ్య మైకంలోకి రాగానే.. వివిధ రూపాల్లో లక్షల రూపాయలను రాబడుతోంది. అలా బెజవాడ నగరంలోని పలువురు హోటల్ యజమానులు, కార్పొరేటర్స్ ఈమె వలలో చిక్కారు. ప్రభుత్వ కాంట్రాక్టర్, కన్సల్టెంట్ అంటూ ప్రముఖులు, వ్యాపారులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పుతోంది.

వీటితోపాటు బెజవాడలో పేరొందిన ఓ న్యాయవాదితోపాటు, ఆమె తమ్ముడు పోతురాజు, రజాక్ అనే అనుచరుడి సహకారంతో వివాదంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తానని డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతోంది. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండే శ్రీదివ్య.. గాంధీనగర్ కుచెందిన ఓ ప్రముఖుడిని ప్రేమ, పెళ్లి అంటూ ఊరించి రూ.80 లక్షలకు కుచ్చు టోపి పెట్టింది. ఆమె మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆ యువ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన గాంధీనగర్ పోలీసులు ఆమె చేస్తున్న మోసాలను చూసి షాక్ తిన్నారు. ఇప్పటి వరకు శ్రీదివ్య ఉచ్చులో ఎవరెవరు చిక్కుకున్నారు..? ఎంత డబ్బు పోగొట్టుకున్నారు..? ఆమెకు సహకరిస్తున్న వారెవరు..? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed