కనకదుర్గ ఫ్లై ఓవర్ వద్ద అపశృతి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్:  విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. అశోక్ పిల్లర్ సమీపంలో ఫ్లై ఓవర్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ఘటనలో APSP బెటాలియన్ కి చెందిన కానిస్టేబుల్ రాంబాబుకు గాయాలయ్యాయి. దసరా ఉత్సవాల బందోబస్తు కోసం విధి నిర్వహణలో భాగంగా ఫ్లై ఓవర్ కింద నిలబడ్డారు రాంబాబు. ఆయన మీద కాంక్రిట్ పెచ్చులు పడటంతో చేతికి, భుజానికి గాయాలయ్యాయి. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో ఫ్లై ఓవర్ [&hellip;]</p>

కనకదుర్గ ఫ్లై ఓవర్ వద్ద అపశృతి
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. అశోక్ పిల్లర్ సమీపంలో ఫ్లై ఓవర్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ఘటనలో APSP బెటాలియన్ కి చెందిన కానిస్టేబుల్ రాంబాబుకు గాయాలయ్యాయి. దసరా ఉత్సవాల బందోబస్తు కోసం విధి నిర్వహణలో భాగంగా ఫ్లై ఓవర్ కింద నిలబడ్డారు రాంబాబు. ఆయన మీద కాంక్రిట్ పెచ్చులు పడటంతో చేతికి, భుజానికి గాయాలయ్యాయి. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో ఫ్లై ఓవర్ పటిష్టతపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story