- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివారం ముహూర్తం ఫిక్స్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి ఆదివారం కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఆదివారం అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలతో విజయశాంతి చర్చలు సాగించారు. ఢిల్లీకి వెళ్లి పార్టీలో చేరేందుకు సిద్ధమైనా కొన్ని కారణాలతో వాయిదా పడింది. గ్రేటర్ ప్రచారంలో భాగంగా అమిత్ షా ఆదివారం వస్తుండటంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరనున్నారు. విజయశాంతితో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా కాషాయతీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. అయితే […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి ఆదివారం కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఆదివారం అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలతో విజయశాంతి చర్చలు సాగించారు. ఢిల్లీకి వెళ్లి పార్టీలో చేరేందుకు సిద్ధమైనా కొన్ని కారణాలతో వాయిదా పడింది. గ్రేటర్ ప్రచారంలో భాగంగా అమిత్ షా ఆదివారం వస్తుండటంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరనున్నారు. విజయశాంతితో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా కాషాయతీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. అయితే పార్టీలో చేరేవారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బీజేపీ పలువురు అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలకు వల వేసింది. ఇప్పటికే టీఆర్ఎస్ నేత, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో నేత కూడా వెళ్తారని భావిస్తున్నారు.అయితే పార్టీలో చేరేవారి వివరాలు ముందుగానే తెలిస్తే ఆ పార్టీల నేతలు అప్రమత్తమవుతున్నారనే కారణంగా బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్‌ను గోప్యత పాటిస్తున్నారు.






