- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హర్దీప్ సింగ్‌కు వైసీపీ ఎంపీ లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు సంబంధించిన రూ.581.60 కోట్ల గ్రాంట్లను విడుదల చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి హర్దీప్సింగ్పూరికి లేఖ రాశారు. ఇప్పటివరకు ఇచ్చిన రూ.3054 కోట్లకు సంబంధించి వినిమయ పత్రాలను సమర్పించినట్లు ఆయన లేఖలో వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పట్టణ పౌర సేవలకు సంబంధించిన మూడు ప్రధాన సంస్కరణలను అమలు చేసినట్లు తెలిపారు. పురపాలక సంఘాల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ వెల్లడించారు. కనీస మౌలిక సదుపాయాల కల్పన […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు సంబంధించిన రూ.581.60 కోట్ల గ్రాంట్లను విడుదల చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి హర్దీప్సింగ్పూరికి లేఖ రాశారు. ఇప్పటివరకు ఇచ్చిన రూ.3054 కోట్లకు సంబంధించి వినిమయ పత్రాలను సమర్పించినట్లు ఆయన లేఖలో వెల్లడించారు.
14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పట్టణ పౌర సేవలకు సంబంధించిన మూడు ప్రధాన సంస్కరణలను అమలు చేసినట్లు తెలిపారు. పురపాలక సంఘాల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ వెల్లడించారు. కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఎన్నో ప్రయాసలకోర్చి నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా సత్వరమే గ్రాంట్లకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Next Story






