- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీలో జోష్.. పీఏసీ సభ్యుడిగా ఆ నేత ఏకగ్రీవం
<p>దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ సభ్యులుగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేష్ దీపక్ వర్మ అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్‌లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు విజయసాయి రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ డా.సుధాంశు త్రివేది […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ సభ్యులుగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేష్ దీపక్ వర్మ అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్‌లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు విజయసాయి రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ డా.సుధాంశు త్రివేది నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఈ ఇద్దరు ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేష్ దీపక్ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీలు అభినందనలు తెలిపారు.
Next Story






