గేదెకు లేని బాధ గుంజకెందుకో: విజయసాయిరెడ్డి

68

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో వైసీపీ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి వ్యతిరేకం అని వైసీపీ నేతలు వాదిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ‘ గేదెకు లేని బాధ గుంజకెందుకో? అన్నట్టుంది నిమ్మగడ్డ వ్యవహారం. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్నందున ఎన్నికల విధులు నిర్వహించలేమని ఉద్యోగులు మొరపెట్టుకున్నా ససేమిరా అన్నాడు. చివరకు న్యాయం గెలిచింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కూ ఆటంకాలు తొలిగిపోయాయి.’ అంటూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.