రౌడీని వెనకేసుకొచ్చింది మీరు కాదా..?

45

దిశ, వెబ్‎డెస్క్: మహిళల భద్రతపై టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. తహశీల్దార్ వనజాక్షి గారిపై చింతమనేని దాడి చేస్తే ఆమెదే తప్పని రౌడీని వెనకేసుకొచ్చిందెవరని ప్రశ్నించారు. బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసినవారిని కాపాడింది మీరు కాదా అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు.