జూమ్ ‘బాబు’కు కరోనా భయం: విజయసాయి‌రెడ్డి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి‌రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కనీసం తన పార్టీ నాయకులను కూడా ఇంటికి రానివ్వడం లేదని విమర్శించారు. అయితే అమరావతి కోసం పోరాడండి అంటూ జూమ్ యాప్‌లో మాత్రం నేతలకు కనిపిస్తున్నాడని అన్నారు. నాయకుడంటే ముందుండి నడిపించాలని, కానీ ఇలా ఇంట్లో కూర్చోని జూమ్ ద్వారా కాదు జూమ్ బాబు [&hellip;]</p>

జూమ్ ‘బాబు’కు కరోనా భయం: విజయసాయి‌రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి‌రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కనీసం తన పార్టీ నాయకులను కూడా ఇంటికి రానివ్వడం లేదని విమర్శించారు.

అయితే అమరావతి కోసం పోరాడండి అంటూ జూమ్ యాప్‌లో మాత్రం నేతలకు కనిపిస్తున్నాడని అన్నారు. నాయకుడంటే ముందుండి నడిపించాలని, కానీ ఇలా ఇంట్లో కూర్చోని జూమ్ ద్వారా కాదు జూమ్ బాబు అంటూ ట్వీట్ చేశారు విజయసాయి.

Next Story