షర్మిలపై అలిగిన విజయమ్మ.. సభ నుంచి వెనక్కి..!

403

దిశ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కొలువు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు. ఇదే క్రమంలో ఉద్యోగ దీక్ష శిబిరానికి మద్దతు తెలిపేందుకు వైఎస్ విజ‌యమ్మ కూడా వచ్చారు. కానీ, ఏమీ మాట్లాడ‌కుండానే వెనుదిరిగారు. సాక్షి మీడియాను వెళ్లిపొమ్మన్నందుకే దీక్ష స్థలం నుంచి విజ‌యమ్మ అలిగి వెళ్లిపోయారేమోన‌ని పలువురు చ‌ర్చించుకుంటున్నారు. అయితే, అంతకు ముందు లైవ్‌లో ఉండ‌గానే సాక్షి క‌వ‌రేజ్ తమకొద్దని.. వెళ్లిపోండ‌ని షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో షర్మిలను వైఎస్ విజయమ్మ వారించారు. ఈ సంభాషణల మధ్యనే వైఎస్ విజయమ్మ సభ నుంచి వెనక్కి వచ్చేసినట్టు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..