- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊరిస్తున్న డీపీఆర్.. 18నెలల్లో 21కి.మీ. మాత్రమే
సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవనం డీపీఆర్ దశలోనే ఊరిస్తున్నది. అదిగో.. ఇదిగో అంటూ డీపీఆర్ రూపకల్పన నత్తనడకన సాగుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే కన్సల్టెన్సీ మెయిన్ హర్ట్ సంస్థ నిర్వాకం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అభాసుపాలవుతున్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవనం డీపీఆర్ దశలోనే ఊరిస్తున్నది. అదిగో.. ఇదిగో అంటూ డీపీఆర్ రూపకల్పన నత్తనడకన సాగుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే కన్సల్టెన్సీ మెయిన్ హర్ట్ సంస్థ నిర్వాకం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అభాసుపాలవుతున్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 18నెలల్లో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ పూర్తిచేసేవిధంగా మెయిన్ హార్ట్ తో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) 2024 డిసెంబర్ 4న ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందానికి నేటితో 18నెలలు పూర్తికానుంది.
మూసీ స్వరూపం
మూసీనది రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తూ, చివరకు కృష్ణానదిలో కలిసే ఒక ముఖ్యమైన ఉపనది. అయితే లంగర్ హౌస్ లోని బాపూఘాట్ వద్ద హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తుంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవహిస్తూ పాత నగరాన్ని, కొత్త నగరాన్ని విభజిస్తుంది. ఈసా, మూసా రెండు చిన్న నదులు బాపుఘాట్ వద్ద కలుస్తాయి. 250కి.మీ.మార్గంలో ప్రవహిస్తూ సూర్యాపేట జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లో గండిపేట్ నుంచి గౌరెళ్లి వరకు 55కి.మీ. మేర విస్తరించి ఉంది.
21కి.మీ మాత్రమే..
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ఐదు జోన్లుగా విభజించారు. గండిపేట్ నుంచి గాంధీ సరోవర్(బాపుఘాట్) 21 కిలోమీటర్లు, గాంధీసరోవర్ నుంచి పురానాపూల్ వరకు 6కి.మీ., పురానాపూర్ నుంచి ఎంజీబీఎస్ వరకు 4కి.మీ., ఎంజీబీఎస్ నుంచి ఉప్పల్ వరకు 8కి.మీ., ఉప్పల్ నుంచి గౌరెల్లి వరకు 16కి.మీ.గా నిర్ణయించారు. ఈ 55కి.మీ. ప్రాజెక్టుకు 18నెలల్లో డీపీఆర్ పూర్తిచేయాలని మెయిన్ హర్ట్ సంస్థకు అప్పగించారు. కానీ అధికారుల ఒత్తిడి మేరకు ఇప్పటివరకు గండిపేట్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21కి.మీ.కు సంబంధించిన 1వ జోన్ కు డీపీఆర్ పూర్తిచేశారు. ఇది కూడా 10రోజుల్లో పూర్తిస్థాయిలో రానున్నట్టు సమాచారం. అయితే 55కి.మీ.మార్గంలో సర్వే మాత్రం చేస్తున్నారు. డీపీఆర్ కు మాత్రం మరో ఆరునెలలు పట్టే అవకాశం ఉందని తెలిసింది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టనున్న 21కి.మీ.ప్రాజెక్టుకు భూసేకరణ ఖర్చు కాకుండానే రూ.ఏడువేల కోట్ల మేర ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీసరోవర్ వరకు 11.8 కి.మీ, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ. మార్గాలను అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హిమాయత్ సాగర్ నుంచి గాంధీసరోవర్ వరకు అభివృద్ధి భూసేకరణ, హిమాయత్ సాగర్ బండ్ బలోపేతం, ఎకో ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు.
3వేలకుపైగా ఫిర్యాదులు
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇళ్లకు నష్టం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. అయితే మంత్రుల సబ్ కమిటీకి మూసీ బాధితుల నుంచి సుమారు మూడు వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. అన్ని ఫిర్యాదులను సబ్ కమిటీ పరిశీలించడంతో పాటు సంబంధిత వ్యక్తులతో చర్చించాలని నిర్ణయించింది. ఫిర్యాదు ఆధారంగా ప్రాజెక్టు ప్రణాళికల్లో మార్పులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ వస్తే తప్ప మార్పులు, చేర్పులు చేయాల్సిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.






