బాధ్యత స్వీకరణకు వేళాయే.. మేయర్‌కు KTR విషెస్

by  |
బాధ్యత స్వీకరణకు వేళాయే.. మేయర్‌కు KTR విషెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలతా‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లలో ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌లో ఆదివారం రోజు పూజలు నిర్వహించారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వీరికి శుభాకాంక్షలు తెలిపారు.

అందుకే కేటీఆర్ మేయర్‌ను కలవలేదా

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్..

మేయర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న గద్వాల్ విజయలక్ష్మికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపినట్టు జీహెచ్ఎంసీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. విజయలక్ష్మి నివాసంలో కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతున్న సమయంలో ఆమె తండ్రి కె.కేశవరావు సైతం అక్కడే ఉన్న ఫొటోను మీడీయాకు విడుదల చేసింది.

Next Story

Most Viewed