అభిజిత్‌కు రౌడీ సపోర్ట్

by  |
అభిజిత్‌కు రౌడీ సపోర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది. ఆదివారం బిగ్‌బాస్ హౌజ్ నుంచి మోనాల్ ఎలిమినేట్ కావడంతో.. ఫినాలే రేస్‌లో అభిజిత్, అఖిల్, అరియానా, సోహైల్, హారిక నిలిచారు. అయితే బిగ్‌బాస్ ఫైనలిస్ట్‌లో ఉన్న ఈ ఐదుగురిలో ‘బిగ్‌బాస్ సీజన్ 4’ విన్నర్‌ అభిజిత్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పుకార్లు రాగా, మరోవైపు అభిజిత్‌కు సెలబ్రిటీల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో యంగ్ స్టార్ అభిజిత్‌కు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

బిగ్‌బాస్ ఫినాలేలో అడుగుపెట్టిన టాప్ కంటెస్టంట్లు అందరూ టాస్కుల్లో బాగానే కష్టపడ్డా.. ఈ విషయంలో అభి ఒక్కడే అంతగా ఆకట్టుకోలేదు. అయినా మైండ్‌గేమ్‌తో నెట్టుకొస్తున్న తను.. దాదాపు ప్రతీ వీక్ ఎలిమినేషన్‌లో ఉన్నాడు. అయితే అమల సపోర్ట్‌తో పాటు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు హోస్ట్ నాగార్జున అభికి ఏదో రకంగా బూస్టప్ ఇస్తూ, ప్రేక్షకుల ముందు తనని పాజిటివ్‌గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సీజ‌న్ మ‌ధ్య నుండే అభిజిత్ విన్నర్ అవుతాడంటూ జోరుగా ప్రచారం జ‌ర‌గ‌గా, ఇప్పుడది త‌ప్పక నిజం అవుతుందనిపిస్తోంది. అభికి అభిమాన సంఘాలు కూడా ఏర్పడటంతో పాటు రోజురోజుకూ తనకు పెరుగుతున్న మ‌ద్దతు చూస్తుంటే అత‌డు విన్నర్ కావ‌డం ఖాయమని అభి ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా త‌న ఇన్‌స్టా ద్వారా అభికు మ‌ద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నాడు. ‘మై బాయ్స్‌కు ఎప్పుడూ శుభాకాంక్షలు ఉంటాయి. అది ఎక్కడైనా, ఏదైనా’ అంటూ​ పోస్ట్‌ చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అభిజిత్ హీరోగా క‌నిపించ‌గా, విజ‌య్ మరో పాత్రలో మెరిశాడు. మరి ఇంతమంది సపోర్ట్‌తో అభి ‘బిగ్ బాస్ 4’ ట్రోఫీని ఇంటికి తీసుకెళతాడా? లేక సోహైల్, అరియానాల నుంచి పోటీ ఎదుర్కొంటాడా? అన్నది వేచి చూడాలి.

Next Story