- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యాచ్‌కు ముందు దుర్భాషలాడిన పాక్ అభిమాని
<p>దిశ, స్పోర్ట్స్: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు జట్లకే కాదు, ఇరు దేశాల అభిమానులకూ ఒక యుద్ధం వంటిదే. గత ఏడాది వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడటానికి ఒకరోజు ముందు టీమ్ఇండియా జట్టు సభ్యులను పాక్ అభిమాని ఒకరు తీవ్రంగా దూషించారట. ఆ విషయాన్ని క్రికెటర్ విజయ్ శంకర్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో చెప్పాడు. ‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావ్ అని నాకు ముందురోజు చెప్పారు. ఆరోజు కొంత మంది జట్టు […]</p>

దిశ, స్పోర్ట్స్: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు జట్లకే కాదు, ఇరు దేశాల అభిమానులకూ ఒక యుద్ధం వంటిదే. గత ఏడాది వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడటానికి ఒకరోజు ముందు టీమ్ఇండియా జట్టు సభ్యులను పాక్ అభిమాని ఒకరు తీవ్రంగా దూషించారట. ఆ విషయాన్ని క్రికెటర్ విజయ్ శంకర్ తాజాగా ఒక పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో చెప్పాడు. ‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నువ్వు ఆడుతున్నావ్ అని నాకు ముందురోజు చెప్పారు. ఆరోజు కొంత మంది జట్టు సభ్యులతో కాఫీకి వెళ్లాం. అక్కడకు వచ్చిన పాకిస్తాన్ అభిమాని ఒకరు మమ్మల్ని దూషించాడు. అదే సమయంలో వీడియో రికార్డ్ కూడా చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోయాం’ అని శంకర్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 89 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. విజయ్ శంకర్ తన తొలి బంతికే వికెట్ తీశాడు. ప్రపంచకప్‌లో ఇంత వరకు పాకిస్తాన్ జట్టు టీమ్ఇండియాను ఓడించలేదు.






