ఆకలికి వ్యాక్సిన్ ప్రసాదించు దేవుడా : సేతుపతి

by Jakkula Samataha |

<p>విజయ్ సేతుపతి విభిన్నమైన పాత్రలు చేస్తూ అటు తమిళ్ ఇటు తెలుగులో బిజీ అయిపోయిన హీరో. మెగాస్టార్ చిరంజీవి &#8216; సైరా &#8216; సినిమాలో ఓ చిన్న పాత్రతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆయన &#8230; పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న &#8216;ఉప్పెన&#8217; చిత్రంతో ఫుల్ లెన్త్ తెలుగు సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ &#8216;పుష్ప&#8217; సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు సేతుపతి. ఇదిలా ఉంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందించే [&hellip;]</p>

ఆకలికి వ్యాక్సిన్ ప్రసాదించు దేవుడా : సేతుపతి
X

విజయ్ సేతుపతి విభిన్నమైన పాత్రలు చేస్తూ అటు తమిళ్ ఇటు తెలుగులో బిజీ అయిపోయిన హీరో. మెగాస్టార్ చిరంజీవి ‘ సైరా ‘ సినిమాలో ఓ చిన్న పాత్రతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆయన … పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ చిత్రంతో ఫుల్ లెన్త్ తెలుగు సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు సేతుపతి.

ఇదిలా ఉంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందించే విజయ్ సేతుపతి.. లాక్ డౌన్ లో ప్రజలు పడుతున్న బాధను చూసి ఆవేదన చెందాడు. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనిపిట్టేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలు… ఆకలి అనే వ్యాధికి కూడా మందు కనిపెడితే బాగుండేదన్నారు. ఆకలి కేకలు ఆందోళన కలిగిస్తున్నాయి… దేవుడా ఈ ఆకలిని తీర్చే మందు ప్రసాదించమని కోరాడు. కాగా కరోనా ప్రభావంతో బాధపడుతున్న సినీ కార్మికులకు తన వంతు సహాయం అందించారు సేతుపతి.

Tags: Vijay Sethupathi, Tollywood, Kollywood, Corona, Covid19, Lock Down

Next Story