‘లాల్ సింగ్ చద్దా’ నుంచి సేతుపతి ఔట్?

by  |
‘లాల్ సింగ్ చద్దా’ నుంచి సేతుపతి ఔట్?
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ వెయిటింగ్ బాలీవుడ్ మూవీస్‌ లిస్ట్‌లో అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ ఒకటి. 2020లోనే రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా ఎఫెక్ట్‌తో 2021 డిసెంబర్‌కు వెళ్లిపోయింది. ఈ చిత్రంలో సౌత్ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తారని గతంలో అమీర్ అఫిషియల్‌గా అనౌన్స్ చేసినా.. ప్రజెంట్ తను ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. హీరోకు ఫ్రెండ్ పాత్రలో కనిపించాల్సిన విజయ్.. ఈ రోల్ కోసం ఎక్స్‌ట్రా వెయిట్ తగ్గలేకపోయాడని, క్యారెక్టర్‌కు తగిన పర్‌ఫెక్ట్ షేప్‌కు రాలేకపోవడంతో మిస్టర్ పర్‌ఫెక్ట్ అసంతృప్తి చెందారని సమాచారం. విజయ్ కమిట్‌మెంట్‌తో హ్యాపీగా లేని అమీర్.. విజయ్ ప్లేస్‌లో మానవ్ విజ్‌ను ఎంచుకున్నారని టాక్. కాగా కొవిడ్ కారణంగా డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితిలో ఉన్న విజయ్.. పలు టాలీవుడ్ ప్రాజెక్ట్‌ల నుంచి కూడా తప్పుకున్న విషయం తెలిసిందే.



Next Story