అమీర్ కోసం బరువు తగ్గిన సేతుపతి

by Shyam |   (  Updated:2020-03-05 05:37:32  IST  )

<p>విజయ్ సేతుపతి భారత సినీ పరిశ్రమకు ప్రత్యేక అతిథి అయిపోయాడు. అతికొద్ది కాలంలోనే స్టార్ హీరో అయిపోయిన విజయ్ &#8230; కథనాయకుడి పాత్రకే పరిమితం కాకుండా&#8230; విలన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా రాణిస్తున్నాడు. మొన్నటికి మొన్న తెలుగులో మెగాస్టార్ చిరు &#8216;సైరా&#8217; మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించిన సేతుపతి&#8230;. ఇళయదళపతి విజయ్ కోసం &#8216;మాస్టర్‌&#8217;లో విలన్ అవతారం ఎత్తాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కోసం బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు. అమీర్ ఖాన్ కొత్త చిత్రం &#8216;లాల్ [&hellip;]</p>

అమీర్ కోసం బరువు తగ్గిన సేతుపతి
X

విజయ్ సేతుపతి భారత సినీ పరిశ్రమకు ప్రత్యేక అతిథి అయిపోయాడు. అతికొద్ది కాలంలోనే స్టార్ హీరో అయిపోయిన విజయ్ … కథనాయకుడి పాత్రకే పరిమితం కాకుండా… విలన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా రాణిస్తున్నాడు. మొన్నటికి మొన్న తెలుగులో మెగాస్టార్ చిరు ‘సైరా’ మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించిన సేతుపతి…. ఇళయదళపతి విజయ్ కోసం ‘మాస్టర్‌’లో విలన్ అవతారం ఎత్తాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కోసం బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అమీర్ ఖాన్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ కోసం బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నాడట. ఇది విజయ్ సేతుపతికి హిందీలో తొలిచిత్రం కాగా… ప్రత్యేక పాత్రలో మెప్పించేందుకు 25 కేజీలు తగ్గనున్నాడట. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ, డైట్ ఫాలో అవుతున్నాడట. కాగా ఈ సినిమాలో తన పాత్ర కోసం అమీర్ కూడా 25 కిలోల బరువు తగ్గాడు. ‘దంగల్’ చిత్రం కోసం అధిక బరువు పెరిగిన అమీర్ .. పాత్ర పర్‌ఫెక్షన్ కోసం 25 కేజీలు వెయిట్ లాస్ అయ్యాడట. కాగా విజయ్ సేతుపతి జూన్ నుంచి ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌లో పాల్గొననున్నాడని సమాచారం.

tags : Vijay Sethupathi, Aamir Khan, Laal Singh Chaddha, Weight Loss

Next Story