బద్లాపూర్ డైరెక్టర్‌తో సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ?

by  |
బద్లాపూర్ డైరెక్టర్‌తో సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బద్లాపూర్’ సినిమాతో హీరో వరుణ్ ధావన్‌కు కెరియర్‌ బెస్ట్ ఫిల్మ్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్.. వరుణ్‌ను న్యూ అవతార్‌లో చూపించి ఆడియన్స్‌కు షాకిచ్చాడు. ఈ సినిమా వరుణ్‌లోని ది బెస్ట్ యాక్టింగ్ స్కిల్స్‌ను బయటపెట్టగా.. మళ్లీ తనతోనే, అంతే ఇంటెన్స్ ఉన్న మూవీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రానికి ‘ఎక్కీస్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. కానీ కరోనా కారణంగా ఈ బిగ్ బడ్జెట్ మూవీని హోల్డ్‌లో పెట్టాల్సి వచ్చింది.

దీంతో సదరు డైరెక్టర్ సౌత్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ‘విక్రమ్ వేద, సూపర్ డీలక్స్’ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సేతుపతి యాక్టింగ్ టాలెంట్.. ప్రతీ ఒక్కరిని మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. ఆ స్కిల్స్‌కు ఫిదా అయిపోయిన డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్.. తనతో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేసేందుకు డిసైడ్ అయ్యారని టాక్. కాగా ఈ సినిమా మక్కల్ సెల్వన్‌‌కు బాలీవుడ్ డెబ్యూ మూవీ కానుంది.



Next Story

Most Viewed