అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తున్న తమన్నా, సేతుపతి

by  |
అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తున్న తమన్నా, సేతుపతి
X

దిశ, సినిమా : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి డజన్‌కు పైగా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నేచురల్ యాక్టింగ్‌తో ఇండియా వైడ్‌‌గా పాపులారిటీ సంపాదించుకున్న సేతుపతి.. కొత్తగా తమిళ్‌లో ‘మాస్టర్ చెఫ్’ హోస్ట్‌గా జర్నీ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ షోపై ఆసక్తి పెంచగా.. తెలుగు ‘మాస్టర్ చెఫ్‌’కు సంబంధించిన న్యూ ప్రోమో మరింత ఆసక్తికరంగా ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా, సేతుపతి కాంబినేషన్‌లో విడుదలైన ప్రోమో ద్వారా తమన్నా హోస్ట్‌గా కనిపించబోతోందని అర్థమవుతుంది. ఈ ప్రోమోలో ‘ఆల్ ది బెస్ట్ బేబీ’ అంటూ తమన్నాకు విష్ చేయగా థాంక్స్ చెప్పింది. కాగా సన్ టీవీ యాజమాన్యం నిర్మిస్తున్న ‘మాస్టర్ చెఫ్’ తెలుగు జెమినీ టీవీలో ప్రసారం కాబోతోంది.

Next Story

Most Viewed