హిందీ వెబ్ సిరీస్‌లో సౌత్ స్టార్స్ హడావిడి..

by  |
హిందీ వెబ్ సిరీస్‌లో సౌత్ స్టార్స్ హడావిడి..
X

దిశ, సినిమా : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న రాజ్ అండ్ డీకే.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ రాశీ ఖన్నా మెయిన్ లీడ్స్‌గా మరో సిరీస్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ నెక్స్ట్ షెడ్యూల్ తాజాగా ప్రారంభం అయింది. అంతేకాదు సౌత్ స్టార్ విజయ్ సేతుపతి సెట్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన రాశీ ఖన్నా… తన ఫేవరేట్ యాక్టర్‌తో థర్డ్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇక ఇందులో సేతుపతి లాయర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుండగా.. యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఈ సిరీస్‌లో భాగమయ్యారా? అనే డౌట్ క్రియేట్ అయింది. బిగ్ బ్రదర్ లవ్ అంటూ సేతుపతిని ముద్దాడుతున్న ఫొటోలను సందీప్ కిషన్ షేర్ చేయడమే ఈ సందేహానికి కారణం కాగా.. ఇదే సిరీస్‌ కోసం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారా లేక పా రంజిత్ డైరెక్షన్‌లో వస్తోన్న ప్రాజెక్ట్‌లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

Fallow disha cinema facebook page: https://www.facebook.com/Dishacinema


Next Story

Most Viewed