ఇండియాకి రాకుండా దొంగ మల్లయ్య ప్లాన్

105

దిశ,వెబ్‌డెస్క్: దొంగమల్లయ్య అదేనండీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్య భారత్‌కు రాకుండా కేంద్రం నుంచి తప్పించుకోవడానికి ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నట్లు తెలుస్తోంది. వేలకోట్లు ఎగ్గొట్టి యూకేకి పారిపోయిన విజయ్ మాల్యా భారత్‌కు రాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు యూకే న్యాయవాది ఫిలిప్ మార్షల్ తెలిపారు. యూకే కోర్ట్‌లు సైతం భారత్ కు అప్పగించేలా నిర్ణయాలు తీసుకున్నా ఇప్పటి వరకు మాల్యా భారత్ కు తిరిగి రాలేదు.యూకే చట్టాల ప్రకారం యూకే హోం కార్యదర్శి ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాయి.
ఈ నేపథ్యంలో యూకే కోర్ట్ నిలిపివేసిన మాల్యా 62.6 మిలియన్ల నిధులపై విచారణ జరిగింది. అయితే, న్యాయమూర్తి మాల్యాకు నిధుల్ని విడుదల చేసే అంశంపై స్టే విధించారు. తీర్పు అనంతరం విజయ్ మాల్యా తరుపు న్యాయమూర్తి బార్నెట్ మాట్లాడుతూ మాల్యా యూకేలో ఉండేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం, కోర్ట్ ఖర్చుల కోసం నిలిపివేసిన నిధుల్ని విడుదల చేయాలని కోర్ట్ ను కోరినట్లు చెప్పారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..