రౌడీ ఫ్యాన్స్..గెట్ రెడీ ఫర్ అప్డేట్

by  |
రౌడీ ఫ్యాన్స్..గెట్ రెడీ ఫర్ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: బ్యాక్‌ టు బ్యాక్‌ వర్క్‌ వల్ల అభిమానులతో మాట్లాడేంత తీరిక లేదని, 2021లో ఇరగదీద్దాం అంటూ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రౌడీ హీరో విజయ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూరీ, లాక్‌డౌన్‌కు ముందు ముంబైలో 40 రోజుల షెడ్యూల్ పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్లీ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దాంతో రౌడీ ఫ్యాన్స్‌ సినిమా విశేషాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూడగా, పూరి ఇచ్చిన హింట్ వారికి న్యూ ఇయర్ కిక్ ఇచ్చింది. విజయ్ అభిమానులు ఆశించినట్లుగానే పూరి బిగ్ అప్‌డేట్ అందించారు. విజయ్ ఫస్ట్‌లుక్, టైటిల్ అనౌన్స్ చేసేందుకు పూరీ టీమ్ సిద్ధమైంది.

పూరిజగన్నాథ్, బాలీవుడ్ అగ్రనిర్మాత కరణ్ జోహర్ కలిసి నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను జనవరి 18న ఉదయం 10గంటల 8నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘భాషతో సంబంధ లేకుండా న్యూ ఏజ్ సినిమాను మీకు పరిచయం చేస్తున్నాం. సినిమా కథలకు భాష పరిమితులు విధించలేదు. ఎంటర్‌టైన్మెంట్ కోషెంట్ మాత్రమే ఆ సినిమా రిచ్‌నెస్‌‌‌ నిర్ధారిస్తుంది’ అంటూ పూరి టీమ్ చెప్పుకొచ్చింది. ఈ న్యూస్‌తో రౌడీ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. పూరితో పాటు, విజయ్‌కి ఇదే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో చిత్రంపై భారీ అంచనాలున్నాయి.



Next Story

Most Viewed