విజయ్‌ని ఇన్‌స్పైర్ చేసిన స్పెషల్ ఫ్యాన్

by  |
విజయ్‌ని ఇన్‌స్పైర్ చేసిన స్పెషల్ ఫ్యాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యాన్స్‌ను ఇన్‌స్పైర్ చేయడం.. వారి నుంచి ఇన్‌స్పిరేషన్ పొందడంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముందుంటారు. తాజాగా దివ్యాంగురాలైన తన అభిమాని స్వప్నిక తన ఫొటో పెయింటింగ్‌ను షేర్ చేయగా.. ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. రెండు చేతులు లేని తను.. అంగవైకల్యాన్ని జయిస్తూ పెయింటింగ్ నేర్చుకోవడం, తన పిక్చర్ వేయడం ఆనందంగా, గర్వంగా ఉందన్నాడు. మీ నుంచి బలం, స్ఫూర్తి పొందానని థాంక్స్ చెప్పాడు.

స్వప్నిక టాలెంట్‌ను ప్రశంసిస్తున్న నెటిజన్లు.. ఈ వీడియో షేర్ చేసిన విజయ్ సింప్లిసిటీ, ఫ్యాన్స్‌కు ఇస్తున్న ఇంపార్టెన్స్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ఇక విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ మళ్లీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇది పూర్తి కాగానే విజయ్ సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారు.

Next Story

Most Viewed