నేషన్ వైడ్ ‘లైగర్’మానియా.. విజయ్ ఎమోషనల్!

by  |
నేషన్ వైడ్ ‘లైగర్’మానియా.. విజయ్ ఎమోషనల్!
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘లైగర్’ మూవీ ఫస్ట్ లుక్ మానియా మామూలుగా లేదు. ‘సాలా క్రాస్ బ్రీడ్’ క్యాప్షన్‌తో వస్తున్న మూవీ ఫస్ట్ లుక్‌ రిలీజ్‌తో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. కటౌట్లు, పాలాభిషేకాలు, టాటూలతో మూవీ యూనిట్‌ను ఎమోషనల్ అయ్యేలా చేశారు. ముఖ్యంగా విజయ్ అభిమానులు వారి ప్రేమతో భావోద్వేగానికి గురయ్యేలా చేశారని, ఫ్యాన్స్‌కు రుణపడి ఉంటానని ట్వీట్ చేశాడు.

ఒకప్పుడు తన వర్క్‌ను ఎవరైన గుర్తిస్తారా? తన సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అని బాధపడిన సందర్భాలున్నాయని.. కానీ, ‘లైగర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన కాసేపటికే ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్, వారు చూపించిన లవ్ తనను ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేలా చేసిందని తెలిపాడు. ‘టీజర్ గురించి వెయిట్ చేయండి.. నేషన్ వైడ్ మ్యాడ్‌నెస్‌కు హామీ ఇస్తున్నాను’ అంటూ ప్రామిస్ చేసిన విజయ్.. ఈ పదాలను కచ్చితంగా గుర్తుంచుకోమని చెప్పాడు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, చార్మి, హిరు యశ్ జోహార్ నిర్మిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అనన్య పాండే హీరోయిన్ కాగా, ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సత్తా చూపించబోతున్నాడు రౌడీ హీరో విజయ్.

https://twitter.com/TheDeverakonda/status/1351408462350094338?s=20

Next Story

Most Viewed