వీణపై విక్కీ కౌశల్ గానా..

by  |
వీణపై విక్కీ కౌశల్ గానా..
X

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలతో దూసుకుపోతున్నాడు. ‘ఉరి – ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న విక్కీ.. ‘సర్దార్ ఉద్దమ్ సింగ్’ చిత్రంతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

https://www.instagram.com/p/CD580T6JUf1/?utm_source=ig_web_copy_link

ఇదిలా ఉంటే, 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విక్కీ.. సరికొత్తగా విష్ చేస్తూ దేశంపై తనకున్న ప్రేమ, గౌరవాన్ని సంగీతం రూపంలో చూపించాడు. తను నటించిన ‘రాజీ’ చిత్రంలోని ‘ఏ వతన్ మేరే వతన్ సాంగ్’ను వీణ మీద ప్లే చేస్తూ తనలో ఉన్న న్యూ టాలెంట్‌ను పరిచయం చేస్తూ దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ సినిమాకు శంకర్ యెహసాన్ లాయ్ సంగీతం అందించగా.. విక్కీ పోస్ట్‌పై స్పందించారు శంకర్ మహదేవన్. ‘చాలా చాలా బాగుంది విక్కీ’ అని తెలిపిన ఆయన.. తన ఫస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ కూడా వీణ అని తెలిపారు. ఈ పాటను విక్కీ.. ఇలా వీణ మీద ప్లే చేస్తుంటే చాలా బాగుందని చెప్పాడు. అనురాగ్ కశ్యప్, ముఖేష్ చోబ్రా, సిద్ధాంత్ చతుర్వేది, ముక్తి మోహన్ కూడా బెస్ట్ కాంప్లిమెంట్స్ అందించారు.

Next Story