- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కత్రినా మెడలో మూడు ముళ్లు వేసిన విక్కీ. అందరి ఆశీర్వాదం కావాలంటూ..
<p>దిశ, సినిమా: బీ టౌన్ బ్యూటీ కత్రినాకైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ మేరకు డిసెంబరు 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కాగా ఈ జంట తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తొలిసారి తన పెళ్లిపై స్పందించిన […]</p>

దిశ, సినిమా: బీ టౌన్ బ్యూటీ కత్రినాకైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ మేరకు డిసెంబరు 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. కాగా ఈ జంట తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తొలిసారి తన పెళ్లిపై స్పందించిన కత్రినా కైఫ్.. ‘మేమిద్దరం కలిసి జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించాం. అందరి ఆశీస్సులు, ప్రేమ కావాలి’ అని క్యాప్షన్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే విక్కీ కూడా తమ అభిమానులతో ఈ గుడ్ న్యూస్ పంచుకుంటూ.. ‘ఈ క్షణం వరకూ మమ్మల్ని నడిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు. మా కొత్త ప్రయాణానికి మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలను కోరుతున్నాం’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ జంట పెళ్లి ఫొటోలను చూసిన ఫ్యాన్స్, సెలబ్రిటీలు.. సాంప్రదాయ దుస్తుల్లో వాళ్లను చూస్తే ముచ్చటేస్తుందని, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వాదిస్తున్నారు.






